మార్కెట్లోకి మహీంద్రా త్రీ వీలర్ ఉడో
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:31 AM
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్‌ఎంఎంఎల్).. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనం ‘మహీంద్రా ఉడో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్‌ఎంఎంఎల్).. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనం ‘మహీంద్రా ఉడో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటో ధర రూ.3,84,299. అయితే పరిమిత కాలం పాటు రూ.3,58,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఉత్పత్తి చేస్తున్నట్లు గురువారం నాడిక్కడ కంపెనీ ఎండీ, సీఈఓ సుమన్ మిశ్రా తెలిపారు. జహీరాబాద్ ప్లాంట్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మూడేళ్ల క్రితమే ప్రకటించామని, అందులో భాగంగానే రూ.500 కోట్లతో కొత్తగా ఆటోమేటెడ్ బ్యాటరీ అసెంబ్లీ లైన్‌తో పాటు రోబోటిక్ ప్రొడక్షన్ లైన్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2 లక్షల యూనిట్లని మిశ్రా తెలిపారు. ఈ ఆటోతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన విభాగంలో కంపెనీ స్థానం మరింత బలోపేతమవుతుందని ఆమె పేర్కొన్నారు. 11.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన ఈ ఆటో ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..