త్వరలో మహీంద్రా ఎస్‌యూవీ ధరల పెంపు
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:27 AM
ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో ఎస్‌యూవీ వాహనాల ధరలను మరోసారి పెంచాలని చూస్తున్నట్లు...
న్యూఢిల్లీ: ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో ఎస్‌యూవీ వాహనాల ధరలను మరోసారి పెంచాలని చూస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. కమోడిటీ ధరలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా రానున్న ఒకటి రెండు వారాల్లో ధరల పెంపుపై తగిన నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈఓ నళినికాంత్ గొల్లగుంట వెల్లడించారు. ఈ ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జూలైలో ఇప్పటికే మూడు విడతల్లో ధరలను పెంచినట్లు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే