Share News

మహీంద్రా లాభంలో 25 శాతం వృద్ధి

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:14 AM

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) 25 శాతం వృద్ధితో రూ.4,587.88 కోట్ల కన్సాలిడేటెడ్‌...

మహీంద్రా లాభంలో 25 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) 25 శాతం వృద్ధితో రూ.4,587.88 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3,673 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో రాబడి రూ.45,885.40 కోట్ల నుంచి రూ.57,514.98 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో మొత్తం వ్యయాలు రూ.41,192.50 కోట్ల నుంచి రూ.51,845.48 కోట్లకు పెరిగాయి. కాగా 2027 జూన్‌ నాటికి కంపెనీ 4 ఎస్‌యూవీలు, ఒక తేలికపాటి వాణిజ్య వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:14 AM