Share News

మహీంద్రా లాభంలో 48 శాతం వృద్ధి

ABN , Publish Date - May 06 , 2026 | 03:15 AM

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.5,259 కోట్ల కన్సాలిడేటెడ్‌...

మహీంద్రా లాభంలో 48 శాతం వృద్ధి

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.5,259 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 48.5 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.42,585.67 కోట్ల నుంచి రూ.54,891.55 కోట్లకు పెరిగింది. అయితే వ్యయాలు మాత్రం రూ.39,113.61 కోట్ల నుంచి రూ.49,615.48 కోట్లకు పెరిగాయి. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.33 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 03:16 AM