Share News

ప్రత్యేక అనుబంధ సంస్థ ద్వారా ఎల్‌ఐసీ రియల్టీ ఆస్తుల నిర్వహణ!

ABN , Publish Date - May 29 , 2026 | 04:32 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తన రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీల నుంచి రిటర్నులను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది....

ప్రత్యేక అనుబంధ సంస్థ ద్వారా ఎల్‌ఐసీ రియల్టీ ఆస్తుల నిర్వహణ!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తన రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీల నుంచి రిటర్నులను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. కంపెనీ స్థిరాస్తుల నిర్వహణ కోసం ఎల్‌ఐసీ ప్రత్యేక అనుబంధ విభాగ సంస్థను సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఈ బీమా సంస్థకు చెందిన స్థిరాస్తుల మొత్తం విలువ రూ.60,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ‘‘వారసత్వంగా లభించడంతో పాటు గడిచిన 70 ఏళ్లలో కొనుగోలు చేసిన వాటితో కలిపి కంపెనీకి భారీగా స్థిరాస్తులున్నాయి. వాటిని సొంత అవసరాలతోపాటు పెట్టుబడిగానూ ఉపయోగించుకుంటున్నాం. ప్రతి స్థిరాస్తిని కంపెనీ పెట్టుబడిగా చూస్తుంది. ప్రతి ప్రాపర్టీ పాలసీదారులతో పాటు కంపెనీ షేర్‌హోల్డర్లకు రిటర్నులు పంచాలని ఆశిసున్నట్లు’’ ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి అన్నారు.

ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 29 , 2026 | 04:33 AM