ఎల్‌ఐసీ లాభం రూ.12,958 కోట్లు
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:57 AM
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ3)లో రూ.12,958 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...
న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ3)లో రూ.12,958 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.11,056 కోట్లతో పోల్చితే లాభం 17ు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం రూ.1,06,891 కోట్ల నుంచి రూ.1,25,613 కోట్లకు పెరిగింది. కాగా సంస్థ ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.2,33,984 కోట్లు గా ఉంది. అలాగే సంస్థ తమ ఏజెంట్లకు రూ.6,011 కోట్లు కమీషన్‌గా చెల్లించింది. కొత్త ప్రీమియం ఆదాయం రూ.10,605 కోట్లుగా ఉంది. కాగా బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ వాటా డిసెంబరు చివరి నాటికి 57.07% ఉంది.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..