ఎల్‌ఐసీ లాభం రూ.12,076 కోట్లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:20 AM
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) రూ.12,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) రూ.12,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,053 కోట్లతో పోల్చితే 20 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర ప్రీమియం ఆదాయం రూ.1,26,479 కోట్ల నుంచి రూ.1,47,018 కోట్లకు ఎగబాకింది. ఇదే త్రైమాసికంలో రెన్యూవల్ ప్రీమియం ఆదాయం రూ.64,996 కోట్ల నుంచి రూ.68,375 కోట్లకు పెరిగింది. అయితే మొదటి సంవత్సరం ప్రీమియం మాత్రం రూ.10,836 కోట్ల నుంచి రూ.10,432 కోట్లకు తగ్గింది.
ఈ వార్తలూ చదవండి
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం