Share News

ఎల్‌ఐసీలో 6.5 శాతం వాటా విక్రయం

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:09 AM

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రభుత్వం 6.5 శాతం వరకు వాటా విక్రయించనుంది. నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు మంగళవారం, బుధవారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు..

ఎల్‌ఐసీలో 6.5 శాతం వాటా విక్రయం

  • ఒక్కో షేరు ధర రూ.382

  • ఖజానాకు రూ.31,000 కోట్లు సమకూరే అవకాశం

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రభుత్వం 6.5 శాతం వరకు వాటా విక్రయించనుంది. నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు మంగళవారం, బుధవారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ ఓఎ్‌ఫఎస్‌ అందుబాటులో ఉండనుంది. ఓఎ్‌ఫఎ్‌సలో భాగంగా ఒక్కో షేరు కనీస ధరను రూ.382గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 6.5 శాతానికి సమానమైన 82.22 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి రూ.31,000 కోట్లు సమకూరనున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎల్‌ఐసీలో ప్రభుత్వం 2.5 శాతం వాటాను ఆఫర్‌ చేయటంతో పాటు గ్రీన్‌ షూ ఆప్షన్‌ ద్వారా మరో 4 శాతం వాటాను విక్రయించనుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపమ్‌) కార్యదర్శి అరుణిష్‌ చావ్లా తెలిపారు. బీఎ్‌సఈలో సోమవారం ఎల్‌ఐసీ షేరు ముగింపు ధర రూ.424.35తో పోల్చితే ఒక్కో షేరును 10 శాతం డిస్కౌంట్‌తో ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. సెబీ.. కనీస షేర్‌హోల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎల్‌ఐసీలో ఈ వాటాను విక్రయిస్తోంది. ఎల్‌ఐసీలో కనీసం 10 శాతం వాటా ప్రజల చేతుల్లో ఉండాలని ప్రభుత్వానికి సెబీ వచ్చే ఏడాది మే 16 వరకు గడువునిచ్చింది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉండగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.21,082 కోట్లు సమీకరించింది.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 05:09 AM