లారస్ ల్యాబ్స్ ఆదాయంలో వృద్ధి
ABN , Publish Date - May 01 , 2026 | 04:39 AM
లారస్ ల్యాబ్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అద్భుత ఫలితాలు సాధించింది. కంపెనీ ఆదాయం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లారస్ ల్యాబ్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అద్భుత ఫలితాలు సాధించింది. కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 5ు పెరిగి రూ.1,812 కోట్లకు చేరగా నికర లాభం 19ు వృద్ధితో రూ.279 కోట్లుగా నమోదైంది. చక్కని నిర్వహణాపరమైన సామర్థ్యం కారణంగా ఎబిటా మార్జిన్ 28.9ు పెరిగినట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వీవీ రవికుమార్ తెలిపారు. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.6,813 కోట్లు కాగా నికర లాభం 148ు వృద్ధితో రూ.889 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.1.20 రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో తాము ఆదాయంతో పాటు లాభంలో కూడా మంచి వృద్ధిని నమోదు చేశామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా అన్నారు.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు