రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:17 AM
హైదరాబాద్‌కు చెందిన ఔషధాల తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు సాధించింది...
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ఔషధాల తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు సాధించింది. బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్ ప్రారంభంలో లారస్ ల్యాబ్స్ షేరు ధర సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి రూ.1,858.95కు ఎగబాకింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మైలురాయికి చేరింది. చివరికి షేరు 0.39శాతం లాభంతో రూ.1,842.70 వద్ద ముగిసింది. దాంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.99,551.79 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్‌లోని లిస్టెడ్ ఫార్మా కంపెనీల్లో రెండో అత్యంత విలువైన సంస్థ ఇదే. రూ.2.21 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దివీస్ లేబొరేటరీస్ అత్యంత విలువైన ఫార్మా కంపెనీగా ఉంది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం