అమరావతిలో రెండు ఆఫీస్ టవర్ల నిర్మాణం
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:48 AM
నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ కింద...
ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ : ఎల్ అండ్ టీ
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ కింద కంపెనీ అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రానికి ఇరువైపులా రెండు భారీ ఆఫీసు టవర్లను నిర్మిస్తుంది. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 47 అంతస్తులతో 37.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తారు. డిజైన్ అండ్ బిల్డ్ కాంట్రాక్టు కింద ఈ రెండు టవర్ల నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువను కంపెనీ వెల్లడించలేదు. దీంతో పాటు ఢిల్లీలో సీపీడబ్ల్యూడీ కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల నిర్మాణ కాంట్రాక్టులు కూడా కంపెనీకి లభించాయు. ఈ రెండు కాంట్రాక్టుల విలువ రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..
అమెరికన్ పిల్లలకు మస్క్ బంపరాఫర్