Share News

కృష్ణా జీవీకే హోటల్‌ ఆదాయం రూ.137 కోట్లు

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:53 AM

కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌ లిమిటెడ్‌ (గతంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో...

కృష్ణా జీవీకే హోటల్‌ ఆదాయం రూ.137 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌ లిమిటెడ్‌ (గతంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.137.31 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ రెవెన్యూపై రూ.38.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.23.51 కోట్లుగా ఉండగా రెవెన్యూ 109.33 కోట్లుగా ఉంది. కాగా ఉత్తర బెంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయ రహదారిపై ఏర్పాటు చేసిన 256 గదుల లగ్జరీ హోటల్‌ తాజ్‌ యెలహంకను ఈ నెల 20న ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జీవీకే వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 02:53 AM