Share News

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం రూ.474 కోట్లు

ABN , Publish Date - May 16 , 2026 | 03:21 AM

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం రూ.474 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.473.80 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.65.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.370.10 కోట్లుగా ఉండగా లాభం రూ.93.5 కోట్లుగా నమోదైంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ.1,440.80 కోట్ల నుంచి రూ.1,758.10 కోట్లకు పెరగగా లాభం మాత్రం రూ.302.90 కోట్ల నుంచి రూ.260.70 కోట్లకు తగ్గింది.

ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Updated Date - May 16 , 2026 | 03:21 AM