కిమ్స్ హాస్పిటల్స్ లాభం రూ.37 కోట్లు
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:59 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్).. రూ.37 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్).. రూ.37 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.85 కోట్లు)తో పోల్చితే లాభం 56 శాతం క్షీణించింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 36.1 శాతం వృద్ధితో రూ.1,196 కోట్లుగా నమోదైంది. జూన్ ముగిసే నాటికి కంపెనీ వద్ద రూ.505 కోట్ల నగదు, అందుకు తత్సమానమైన నిల్వలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్స్.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో మొత్తం 8,300 పడకల సామర్థ్యం కలిగిన 26 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. కాగా కార్యకలాపాల విస్తరణ ద్వారా కొత్తగా 1,300 పడకల ను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ