కిమ్స్ రూ.1,500 కోట్ల సమీకరణ
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:55 AM
హెల్త్‌కేర్ సేవలందించే కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం...
హైదరాబాద్: హెల్త్‌కేర్ సేవలందించే కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిం ది. ఈక్విటీ షేర్ల జారీ లేదా క్యూఐపీ ప్లేస్‌మెంట్ లేదా ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను బోర్డు పరిశీలించి ఆమోదం తెలిపినట్టు రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో కంపెనీ తెలిపింది. వాటాదారుల ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ నిర్ణయం ఉంటుందని పేర్కొంటూ ఇష్యూ ధరను తదుపరి ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..