Share News

కిమ్స్‌ విస్తరణ బాట

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:06 AM

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స...

కిమ్స్‌ విస్తరణ బాట

నాలుగు ఆస్పత్రుల్లో వాటాల కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(కిమ్స్‌) వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ఆస్పత్రుల్లో వాటాలు కొనుగోలు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. నగరంలోని కొంపల్లిలో ఉన్న స్ప్లెండిడ్‌ హాస్పిటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 22 శాతం వాటాను రూ.40 కోట్లకు చేజిక్కించుకుంది. మహారాష్ట్రలోని ఉషాకల్‌ అభినవ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో 6 శాతం వాటాను రూ.15 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 150 పడకల ఆస్పత్రిని నిర్వహిస్తున్న ఇన్‌సిగ్నియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం ఈక్విటీ వాటాను దక్కించుకుంది. అలాగే, కాకినాడకు చెందిన సర్వోత్తమ్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:06 AM