కియా కార్ల ధరలు 2 శాతం పెంపు
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:45 AM
కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. జూలై 1 నుంచి తమ అన్ని వాహనాల ధరలను గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు...
న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. జూలై 1 నుంచి తమ అన్ని వాహనాల ధరలను గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుందని తెలిపింది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
అదేబాటలో టాటా మోటార్స్: టాటా మోటార్స్.. తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి తమ ట్రక్కులు, బస్సులు సహా అన్ని కమర్షియల్ వాహనాల ధరలను గరిష్ఠంగా 2.5 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..