కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు ‘శాట్’లో చుక్కెదురు
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:15 AM
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్), సంస్థ సీఎండీ సీ పార్థసారధికి సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (శాట్)లో...
ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్), సంస్థ సీఎండీ సీ పార్థసారధికి సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (శాట్)లో చుక్కెదురైంది. 2023 ఏప్రిల్ 28న తమపై సెబీ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేఎ్‌సబీఎల్, పార్థసారిధి చేసిన అప్పీళ్లను శాట్ తోసిపుచ్చింది. ఇందుకు అప్పీల్ చేయడానికి 688 రోజులు ఆలస్యం కావడాన్ని మన్నించాలని కేఎ్‌సబీఎల్, పార్థసారధి చేసిన విజ్ఞప్తులను కూడా శాట్ తిరస్కరించింది.
క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లోని సెక్యూరిటీలను అక్రమంగా కుదువ పెట్టి, నిధులు సమీకరించి దుర్వినియోగం చేసినందుక గాను సెబీ,, 2023 ఏప్రిల్ 28న కేఎ్‌సబీఎల్, పార్థసారధిలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉత్తర్వులను కేఎ్‌సబీఎల్, పార్థసారధి శాట్‌లో 688 రోజులు ఆలస్యంగా సవాల్ చేశారు. ఈ ఆలస్యాన్ని మన్నించేందుకు వీరు పేర్కొన్న డాక్యుమెంట్లను పరిశీలించేందుకు కూడా శాట్ నిరాకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ