Share News

ఏపీ, తెలంగాణపై మరింత ఫోకస్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:26 AM

కొత్త తరం డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లపై మరింతగా దృష్టి సారించనుంది...

ఏపీ, తెలంగాణపై మరింత ఫోకస్‌

  • జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొత్త తరం డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లపై మరింతగా దృష్టి సారించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో తెలుగు రాష్ట్రాల్లో 39ు ప్రీమియం వృద్ధిని నమోదు చేసినట్లు సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ జాక్సన్‌ జాకబ్‌, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ పూజా యాదవ్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో జునో ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో మోటార్‌ ఇన్సూరెన్స్‌ వాటానే గణనీయంగా ఉందని, హెల్స్‌ ఇన్సూరెన్స్‌పై ఇప్పుడిప్పుడే దృష్టిని సారిస్తున్నట్లు జాకబ్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల మార్కెట్లపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వాములతో పాటు మోటార్‌ కంపెనీలతో జట్టు కట్టడం ద్వారా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు జాకబ్‌ తెలిపారు. కాగా కంపెనీ యాప్‌లోని మొబైల్‌ టెలిమ్యాట్రిక్‌ ప్రోగ్రామ్‌ ద్వారా రియల్‌ టైమ్‌ డ్రైవింగ్‌, ఇంధన ఆదా వంటి వివరాలను తెలుసుకుని బీమా ప్రీమియాలను నిర్ణయిస్తున్నట్లు పూజా యాదవ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 04:26 AM