ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూకు వాటా!
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:18 AM
జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఏజీ తన భారత మార్కెట్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయగలిగే భాగస్వామి కోసం చూస్తోంది....
తుది దశలో ఇరు వర్గాల చర్చలు
న్యూఢిల్లీ: జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఏజీ తన భారత మార్కెట్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయగలిగే భాగస్వామి కోసం చూస్తోంది. ఇందులో భాగంగా సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో ఫోక్స్‌వ్యాగన్ ఏజీ చర్చలు తుది దశకు చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది వారాల్లో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరవచ్చని వారన్నారు. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం.. ఫోక్స్‌వ్యాగన్ భారత అనుబంధ విభాగమైన ‘స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‘లో పెట్టుబడుల ద్వారా మెజారిటీ వాటాను జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఫోక్స్‌వ్యాగన్ రెండు దశాబ్దాలకు పైగా ఇండియా మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అయినప్పటికీ, భారత వాహన ప్రియులకు అంతగా చేరువ కాలేకపోయింది. ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, పోర్షె, బెంట్లీ, లంబోర్గినీ బ్రాండ్లను విక్రయిస్తున్న సంస్ధ దేశీయ వాహన మార్కెట్లో కేవలం 2.5 శాతం వాటా కలిగి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!