Share News

వాణిజ్య ఈవీల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:31 AM

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తాజాగా వాణిజ్య విద్యుత్‌ వాహనాల(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన కమర్షియల్‌ ఈవీల...

వాణిజ్య ఈవీల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌

  • యాంప్‌స్టార్‌ పేరుతో కొత్త బ్రాండ్‌ లాంచ్‌

  • రూ.2,500 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తాజాగా వాణిజ్య విద్యుత్‌ వాహనాల(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన కమర్షియల్‌ ఈవీల విభాగమైన జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్‌ మంగళవారం యాంప్‌స్టార్‌ పేరుతో సరికొత్త బ్రాండ్‌నేమ్‌ను లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్‌నేమ్‌తో ఎలక్ట్రిక్‌ ట్రక్కులు, బస్సులను తయారు చేసి విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం కంపెనీ రూ.2,500 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏటా 15,000 యూనిట్ల వాహనాల తయారీ సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పీఎం ఈ-డ్రైవ్‌ పథకంలో భాగంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు బస్సుల సరఫరాకు సంస్థ ఆసక్తిగా ఉంది. ఇందుకు సంబంధించిన టెండర్లలో పాల్గొంటామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఎండీ పార్థ్‌ జిందాల్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ టిప్పర్లు, డంపర్ల సరఫరా కోసం వేదాంత, అదానీ వంటి బడా సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 04:33 AM