13,000 మంది విద్యార్ధులకు స్కూల్ కిట్స్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:28 AM
జోయాలుక్కాస్ ఫౌండేషన్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 13,000 మంది విద్యార్ధులకు స్కూల్ కిట్స్‌ను...
జోయాలుక్కాస్ ఫౌండేషన్
హైదరాబాద్: జోయాలుక్కాస్ ఫౌండేషన్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 13,000 మంది విద్యార్ధులకు స్కూల్ కిట్స్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త విద్యా సంవత్సరంలో ఎల్‌కేజీ నుంచి 4వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్ధికి నాణ్యమైన స్కూల్ బ్యాగ్, నోట్‌బుక్స్, పెన్సిల్ బాక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్‌తో పాటు గొడుగును ఈ కిట్ ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పుడు సంబంధిత రాష్ట్రాల్లోని జోయాలుక్కాస్ షోరూమ్‌ల ద్వారా ఈ స్కూల్ కిట్స్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్ధి విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పాటు సామాజిక సేవలో భాగంగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జోయాలుక్కాస్ ఫౌండేషన్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం