అమెరికాలో జోయాలుక్కాస్ విస్తరణ
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:40 AM
వరల్డ్ ఫేవరేట్ జువెలర్ జోయాలుక్కాస్.. అమెరికాలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. న్యూజెర్సీ, ఐసెలిన్‌లో కొత్తగా షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. అమెరికాలో...
హైదరాబాద్: వరల్డ్ ఫేవరేట్ జువెలర్ జోయాలుక్కాస్.. అమెరికాలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. న్యూజెర్సీ, ఐసెలిన్‌లో కొత్తగా షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. అమెరికాలో జోయాలుక్కా్‌సకు ఇది ఎనిమిదో షోరూమ్. అమెరికా మార్కెట్లోకి అడుగుపెట్టి పదేళ్లయిన సందర్భంగా ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఐసెలిన్, 42 మార్కోని అవెన్యూలో ఏర్పాటు చేసిన షోరూమ్‌ను వుడ్‌బ్రిడ్జ్ టౌన్‌షి్‌ప మేయర్ జాన్ ఈ. మెక్ కార్మెక్, జోయాలుక్కాస్ జువెలరీ సీఈఓ జాన్ పాల్ అలుక్కాస్, డైరెక్టర్ సోనియా అలుక్కాస్ ప్రారంభించారు. అమెరికాలో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జోయాలుక్కాస్ ఐసెలిన్ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, పోల్కి సహా ఇతర ఆభరణాల తయారీ చార్జీలపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు