Share News

జోస్‌ అలుక్కాస్‌.. ఎక్స్ఛేంజ్‌ ఫర్‌ ది నేషన్‌ క్యాంపెయిన్‌

ABN , Publish Date - May 29 , 2026 | 04:35 AM

జోస్‌ అలుక్కాస్‌.. ‘ఎక్స్ఛేంజ్‌ ఫర్‌ ది నేషన్‌’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు తమ దగ్గర...

జోస్‌ అలుక్కాస్‌.. ఎక్స్ఛేంజ్‌ ఫర్‌ ది నేషన్‌ క్యాంపెయిన్‌

హైదరాబాద్‌: జోస్‌ అలుక్కాస్‌.. ‘ఎక్స్ఛేంజ్‌ ఫర్‌ ది నేషన్‌’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు తమ దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైకిల్‌ చేసి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరింది. భారత విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని, అందుకు తగ్గట్టుగా బంగారం కొనుగోళ్లను ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రజలను ప్రధాని మోదీ ఇటీవల కోరారు. ప్రధాని సూచనలకు అనుగుణంగా జోస్‌ అలుక్కాస్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎక్స్ఛేంజ్‌ ఫర్‌ ది నేషన్‌ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. బంగారం మార్పిడి, ఎంపిక చేసిన బంగారు ఆభరణాల తయారీ చార్జీలపై కస్టమర్లు అదనంగా రూ.2,000 వరకు ప్రయోజనం పొందటంతో పాటు ఫ్లాట్‌ 50 శాతం తగ్గింపును పొందవచ్చని జోస్‌ అలుక్కాస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 60కి పైగా జోస్‌ అలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 29 , 2026 | 04:35 AM