Share News

జేఎల్‌ఆర్‌ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గింపు

ABN , Publish Date - May 06 , 2026 | 04:41 AM

భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) దృష్టిలో ఉంచుకుని జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా మంగళవారం కీలక ప్రకటన చేసింది...

జేఎల్‌ఆర్‌ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గింపు

బ్రిటన్‌ నుంచి దిగుమతయ్యే మోడళ్లకు మాత్రమే

న్యూఢిల్లీ: భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) దృష్టిలో ఉంచుకుని జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా మంగళవారం కీలక ప్రకటన చేసింది. యూకే నుంచి నేరుగా కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ) రూపంలో దిగుమతి చేసుకునే తన రేంజ్‌ రోవర్‌ మోడళ్లపై ధరను రూ.75 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రేంజ్‌ రోవర్‌ ఎస్‌వీ, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వీ మోడళ్లపై ఈ ప్రయోజనం అందుతుందని పేర్కొంది. రేంజ్‌ రోవర్‌ ఎస్‌వీ ధరను రూ.4.25 కోట్ల నుంచి రూ.3.5 కోట్లకు (ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర), రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వీ ధరను రూ.2.75 కోట్ల నుంచి రూ.2.35 కోట్లకు తగ్గించినట్టు తెలిపింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. భారత్‌లో తయారు చేసే రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, రేంజ్‌ రోవర్‌ వెలార్‌, డిస్కవరీ స్పోర్ట్‌ వంటి మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 04:41 AM