Share News

టి-మొబైల్‌తో జియో జట్టు

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:19 AM

జియో కస్టమర్లు విదేశాలకు వెళ్లినా ఇక దిగుల్లేదు. అక్కడ కూడా తమ సిమ్‌ మార్చకుండా 5జీ రోమింగ్‌ సేవలు...

టి-మొబైల్‌తో జియో జట్టు

5జీ స్టాండ్‌ఎలోన్‌ రోమింగ్‌ సేవలు

న్యూఢిల్లీ: జియో కస్టమర్లు విదేశాలకు వెళ్లినా ఇక దిగుల్లేదు. అక్కడ కూడా తమ సిమ్‌ మార్చకుండా 5జీ రోమింగ్‌ సేవలు అందుకోవచ్చు. జియో ఇందుకోసం అమెరికా టెలికాం ఆపరేటర్‌ టి-మొబైల్‌తో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఈ రెండు ఆపరేటర్ల కస్టమర్లు ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంలో తమ మొబైల్‌ సిమ్‌ మార్చకుండానే నిరంతరం 5జీ స్టాండ్‌ఎలోన్‌ రోమింగ్‌ సేవలు అందుకోవచ్చు. ప్రపంచంలోనే ఇది తొలి 5జీ స్టాండ్‌ఎలోన్‌ రోమింగ్‌ సర్వీస్‌ అని రెండు కంపెనీలు తెలిపాయి. కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ సినివర్స్‌.. ఇందుకోసం రెండు కంపెనీలకు అనుసంధానకర్తగా పని చేస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 05:19 AM