యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జియో ఐపీఓకు భారీ స్పందన
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:17 AM
30 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ నమోదు జూరూ.8,110 కోట్ల షేర్లకు గాను రూ.2.5 లక్షల కోట్ల బిడ్ల దాఖలున్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల...
30 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ నమోదు జూరూ.8,110 కోట్ల షేర్లకు గాను రూ.2.5 లక్షల కోట్ల బిడ్ల దాఖలున్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు అపూర్వ స్పందన లభిస్తోంది. యాంక ర్ ఇన్వెస్టర్లకు ఈ ఐపీఓ సోమవారం అందుబాటులోకి వచ్చింది. ఐపీఓలో వీరి కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా.. ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. అంటే, వీరి వాటా షేర్లకు 30 రెట్లకు పైగా సబ్‌స్ర్కిప్షన్ లభించింది.
ఎవరెవరు బిడ్ వేశారంటే..: అంతర్జాతీయ అసెట్ మేనేజర్లు, ప్రభుత్వ వెల్త్ ఫండ్లు, దేశీయ మ్యూచువల్ ఫండ్, పెన్షన్ ఫండ్, బీమా సంస్థలు సహా పలు సంస్థాగత ఇన్వెస్టర్లు జియో షేర్ల కోసం పోటీపడ్డారని ఈ విషయంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. కొందరు బడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థలైతే 75 కోట్ల డాలర్ల నుంచి 100 కోట్ల డాలర్ల షేర్ల కోసం బిడ్ వేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రథమ శ్రేణి ఫండ్లు ఈ ఆఫర్‌లో రూ.400-450 కోట్ల విలువైన షేర్లను దక్కించుకునే అవకాశం ఉందని.. చిన్న ఇన్వెస్టర్లకు రూ.10-20 కోట్ల షేర్ల దక్కవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
రేపటి నుంచి రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి: జియో ఐపీఓ ఈ నెల 21 నుంచి 23 వరకు రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 28న కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో నమోదు చేసే అవకాశం ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 27 కోట్ల తాజా షేర్లను జారీ చేస్తోంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.1,065-1,119గా నిర్ణయించింది.
ఈ ధరల శ్రేణిలోని గరిష్ఠ స్థాయి ప్రకారంగా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అంటే, భారత మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఈ పబ్లిక్ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లను జియో ఉద్యోగులకు, రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రిజర్వ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
For More AP News And Telugu News