Share News

జువెలరీ సంస్థల అమ్మకాలు అదుర్స్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:46 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026 -27) సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2) దేశంలోని ప్రధాన లిస్టెడ్‌ జువెలరీ సంస్థలకు బాగానే కలిసొచ్చింది. గత ఏడాది ఇదే...

జువెలరీ సంస్థల అమ్మకాలు అదుర్స్‌

సెప్టెంబరు త్రైమాసికంలో 28% వరకు పెరిగిన ఆదాయాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026 -27) సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2) దేశంలోని ప్రధాన లిస్టెడ్‌ జువెలరీ సంస్థలకు బాగానే కలిసొచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సెప్టెంబరు త్రైమాసికంలో ఈ సంస్థల ఆదాయం 22 నుంచి 28ు వరకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరులోనే వచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం అక్టోబరు మాసంలో వచ్చాయి. అయినా సెప్టెంబరు త్రైమాసికంలో లిస్టెడ్‌ జువెలరీ సంస్థల ఆదాయం 22 నుంచి 28 శాతం వరకు పెరగడం విశేషం. కస్టమర్ల నుంచి డిమాండ్‌తో పాటు కొనుగోళ్లు పెరగడం, ఒక్కో స్టోర్‌ ద్వారా జరిగే సగటు అమ్మకాలు పెరగడం ఇందుకు ప్రఽధాన కారణాలని మార్కెట్‌ వర్గాలు చెప్పాయి. ఈ కాలంలో కల్యాణ్‌ జువెలర్స్‌ ఆదాయం 26ు పెరిగింది. దేశీయ అమ్మకాల ఆదాయం 27ు, విదేశీ ఆదాయం 18ు చొప్పున పెరిగాయి. ఇక పీఎన్‌ గాడ్గిల్‌ జువెలర్స్‌.. అమ్మకాల ఆదాయం 22.4ు పెరిగింది. రిటైల్‌ సెగ్మెంట్‌ ఆదాయం 31.1ు, సేమ్‌ స్టోర్‌ అమ్మకాల ఆదాయం 25.5ు చొప్పున పెరిగాయి. మరోవైపు టాటా గ్రూప్‌ కంపెనీ టైటాన్‌ అమ్మకాల ఆదాయం 21ు పెరిగింది. పెట్టుబడి లాభాల కోసం కొనే బంగారు నాణేల అమ్మకాల వృద్ధి రేటు క్యూ2లో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయింది. టైటాన్‌.. తనిష్క,మియా, జోయా,బియాన్‌, క్యారట్‌లైన్‌ బ్రాండ్లతో స్లోర్టను నిర్వహిస్తోంది. కాగా పీసీ జువెలర్స్‌ సెప్టెంబరు త్రైమాసిక అమ్మకాల ఆదాయం 28ు పెరిగింది.

డిసెంబరు త్రైమాసికంపైనా ఆశలు

ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అక్టోబరులో వచ్చాయి. దీంతో డిసెంబరుతో ముగిసే త్రైమాసికంలో అమ్మకాలు మరింత ఆశాజనకంగా ఉంటాయని జువెలరీ కంపెనీలు భావిస్తున్నాయి. జనవరిలో చుక్కలంటిన పసిడి ధర 20 శాతానికి పైగా దిద్దుబాటుకు లోనవడం ఇందుకు దోహదం చేస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 19 , 2026 | 04:46 AM