భారత్‌లో జావెలిన్ మిస్సైల్స్ తయారీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:44 AM
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి భారత కేంద్రంగా మారుతోంది. తాజాగా దేశంలో జావెలిన్ మిస్సైల్ సిస్టమ్స్ తయారీకి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్...
న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి భారత కేంద్రంగా మారుతోంది. తాజాగా దేశంలో జావెలిన్ మిస్సైల్ సిస్టమ్స్ తయారీకి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్), జావెలిన్ జాయింట్ వెంచర్ (జేజేవీ) అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా టీఏఎ్‌సఎల్, జేజేవీ.. భారత్‌లో జావెలిన్ ఆల్ అప్ రౌండ్ (ఏయూఆర్)ను సంయుక్తంగా తయారు చేయనున్నాయి. అమెరికాకు చెందిన జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయ సైన్యం ఒప్పందం కుదుర్చుకున్న కొద్దిరోజుల్లోనే భారత్‌లో ఈ ఉత్పత్తుల తయారీకి ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ జేజేవీ.. ఆర్‌ఎక్స్ బిజినె్‌సకు చెందిన రెథియాన్, లాకిడ్ మార్జిన్‌కు చెందిన జాయింట్ వెంచర్ సంస్థ. కాగా ఈ ఒప్పందం కింద జావెలిన్ ఏయూఆర్ కోసం ఫైనల్ అసెంబ్లింగ్ లైన్, ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఏర్పాటుతో పాటు కాంపోనెంట్ ఉత్పత్తుల తయారీకి ఉన్న అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలిస్తాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి