Share News

ఐటీఆర్‌ల ఫైలింగ్‌కు రంగం సిద్ధం

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:56 AM

ఆదాయ పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫారాల ఫైలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026-27 మదింపు సంవత్సరానికి (ఏవై) వివిధ తరగతుల పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన ఏడు రకాల...

ఐటీఆర్‌ల ఫైలింగ్‌కు రంగం సిద్ధం

ఏడు ఐటీ ఫారాల విడుదల

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫారాల ఫైలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026-27 మదింపు సంవత్సరానికి (ఏవై) వివిధ తరగతుల పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన ఏడు రకాల ఐటీఆర్‌ ఫారాలను కేంద్ర ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం నోటిఫై చేసింది. వీటిని మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఈ రిటర్నులు ఫైల్‌ చేయాలి. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం

  • చిన్న, మధ్య తరహా ఆదాయ పన్ను చెల్లింపుదారులు సహజ్‌ (ఐటీఆర్‌-1), సుగమ్‌ (ఐటీఆర్‌-4) ఫారాల ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి

  • జీతం, ఒక గృహ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయం, వడ్డీ వంటి ఇతర ఆదాయాలు, వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.5,000 వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులు సహజ్‌ (ఐటీఆర్‌-1) ద్వారా తమ ఐటీ రిటర్న్‌ సమర్పించాలి.

  • వ్యాపార, వృత్తిపరంగా వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎ్‌ఫ), సంస్థలు సుగమ్‌ (ఐటీఆర్‌-4) ద్వారా తమ ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి.

  • మూలధన లాభాలు తప్ప వ్యాపార, వృత్తిపరంగా లాభనష్టాలు లేని వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు ఐటీఆర్‌-2 ద్వారా రిటర్న్‌ ఫైల్‌ చేయాలి.

  • యాజమాన్య వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు ఐటీఆర్‌-3 ఫారం ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

  • సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, సహకార సంస్థలు ఐటీఆర్‌-5 ద్వారా తమ రిటర్న్‌లు సమర్పించాలి.

  • కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీలు ఐటీఆర్‌-6 ద్వారా చేయాలి.

  • ట్రస్టులు, ధార్మిక సంస్థలు ఐటీఆర్‌-7 ద్వారా రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

ఎప్పటిలోగా: వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తమ ఖాతాలను ఆడిట్‌ చేయించాల్సిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా తమ ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 02:56 AM