Share News

క్విక్‌ కామర్స్‌పై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:40 AM

ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ఐటీసీ ఫుడ్స్‌ విభాగం క్విక్‌ కామర్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది

క్విక్‌ కామర్స్‌పై ప్రత్యేక దృష్టి
chaturuvedhi

  • అందుబాటులోకి త్వరలో కొత్త ఉత్పత్తులు

  • ఐటీసీ బిస్కెట్స్‌ సీఈఓ కవితా చతుర్వేది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ఐటీసీ ఫుడ్స్‌ విభాగం క్విక్‌ కామర్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్విక్‌ కామర్స్‌ విభాగంలో బిస్కెట్లు, ఇతర కన్ఫెక్షనరీ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా తాము కూడా ఈ విభాగం కోసం ప్రత్యేక ఉత్పత్తులను తీసుకురావాలని చూస్తున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ (పుడ్స్‌ డివిజన్‌) బిస్కెట్స్‌, కన్షెక్షనరీ సీఈఓ కవితా చతుర్వేది తెలిపారు. మెట్రో నగరాల్లో ప్రీమియం ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ ఉంటోందని, ఇప్పటికే తక్కువ కాలం మన్నికగా ఉండే కుకీస్‌ వంటి తాజా బేకరీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగా త్వరలో మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని చూస్తున్నట్లు ఆమె చెప్పారు. అన్ని వర్గాల వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రీమియం ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తున్నట్లు చతుర్వేది తెలిపారు.

తెలంగాణ ప్లాంట్‌లో త్వరలో కొత్తలైన్‌: ఐటీసీకి దక్షిణాది అతిపెద్ద మార్కెట్‌గా ఉండగా అందు లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అత్యంత కీలకంగా ఉన్నాయని చతుర్వేది వెల్లడించారు. బిస్కెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల కోసం తెలంగాణ ప్లాంట్‌పై ఇప్పటికే రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 11 లైన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టబోయే కొత్త ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త లైన్‌ కోసం ఎంత పెట్టుబడులు పెట్టనున్నారనే విషయాలను ఆమె వెల్లడించలేదు. ఐటీసీ ప్రస్తుతం బిస్కెట్లు, చిప్స్‌, డార్క్‌ ఫాంటసీ వంటి ఉత్పత్తుల తయారీకి దేశవ్యాప్తంగా 12 మెగాప్లాంట్లను నిర్వహిస్తోందని చతుర్వేది తెలిపారు.

ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

Updated Date - Nov 11 , 2026 | 05:44 AM