పోషకాహార విభాగంపై ఐటీసీ నజర్
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:57 AM
ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ లిమిటెడ్.. వేగంగా విస్తరిస్తున్న హెల్త్ అండ్ వెల్‌నెస్ మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు...
బెంగళూరు: ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ లిమిటెడ్.. వేగంగా విస్తరిస్తున్న హెల్త్ అండ్ వెల్‌నెస్ మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా మారుతున్న వినియోగదారుల ఆహార అలవాట్లకు అనుగుణంగా ప్రోటీన్ ఆధారిత ఆహారోత్పత్తుల పోర్టుఫోలియోను భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే హై ప్రోటీన్ చిప్స్, ప్లాంట్-ప్రోటీన్ షేక్స్ వంటి వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నట్లు ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో