Share News

ఐటీ షేర్లు మళ్లీ కుదేలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:29 AM

భారత ఐటీ రంగ షేర్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు గురువారం 5 శాతానికి పైగా క్షీణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఎంఫసిస్‌, పెర్సిస్టెంట్‌, సైయెంట్‌ షేర్లు...

ఐటీ షేర్లు మళ్లీ కుదేలు

టీసీఎస్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా స్టాక్స్‌

5 శాతానికి పైగా పతనం

రూ.లక్ష కోట్లకు పైగా తగ్గిన టెక్‌ కంపెనీల మార్కెట్‌ విలువ

ముంబై: భారత ఐటీ రంగ షేర్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు గురువారం 5 శాతానికి పైగా క్షీణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఎంఫసిస్‌, పెర్సిస్టెంట్‌, సైయెంట్‌ షేర్లు 4.81 శాతం వరకు నష్టపోయాయి. దాంతో బీఎ్‌సఈలోని ఐటీ సూచీ 5.29 శాతం, ఫోకస్డ్‌ ఐటీ ఇండెక్స్‌ 5.40 శాతం తగ్గాయి. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 2020 డిసెంబరు తర్వాత తొలిసారిగా రూ.10 లక్షల కోట్ల దిగువకు జారుకుంది. ఐటీ రంగ షేర్ల మొత్తం మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లకు పైగా తరిగిపోయింది. ఫెడ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో టెక్నాలజీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఆ ప్రభావంతో దలాల్‌ స్ట్రీట్‌లోనూ ట్రేడర్లు సైతం ఈ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తించారు. ఇందుకు తోడు, ఆంథ్రోపిక్‌ ఈ మధ్య ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్‌.. ఔట్‌సోర్సింగ్‌ సేవలందించే ఐటీ కంపెనీలకు ప్రత్యామ్నాయం కాగలవని, దాంతో వాటి ఆదాయాలకు గండిపడవచ్చన్న భయాలు మార్కెట్లో ఊపందుకున్నాయి. ఆంథ్రోపిక్‌ ఎఫెక్ట్‌తో ఐటీ షేర్లు భారీ గా నష్టపోవడం ఈ నెలలో ఇది రెండోసారి.

సెన్సెక్స్‌ 558 పాయింట్లు ఫట్‌

ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లూ నష్టాల్లో కొనసాగడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం భారీగా క్షీణించాయి. ఒక దశలో 716.97 పాయింట్లు పతనమై 83,516.67 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. చివరికి 558.72 పాయింట్ల నష్టంతో 83,674.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 146.65 పాయింట్లు కోల్పోయి 25,807.20 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 05:29 AM