Share News

‘ఐటీ’లో కాంట్రాక్టు నియామకాలకు పెద్దపీట

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:51 AM

దేశ ఐటీ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో...

‘ఐటీ’లో కాంట్రాక్టు నియామకాలకు పెద్దపీట

గత ఆర్థిక సంవత్సరంలో 10.1% వృద్ధి

శాశ్వత నియామకాలతో

పోలిస్తే నాలుగు రెట్లు అధికం

ముంబై: దేశ ఐటీ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నియామకాలు 10.1 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో శాశ్వత టెక్నాలజీ ఉద్యోగుల నియామకాల్లో 2.3 శాతమే వృద్ధి నమోదైంది. శాశ్వత నియామకాలతో పోల్చితే కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు నాలు గు రెట్లకు పైగా ఎక్కువ ఉన్నట్లు హెచ్‌ఆర్‌ సంస్థ సీఐఈఎల్‌ తాజా నివేదిక వెల్లడించింది. చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ టెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో కంపెనీలు కాంట్రాక్టు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. 2025-26లో ఏఐ/ఎంఎల్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ 45 శాతం పెరిగిందని, టెక్నాలజీ నియామకాల్లో దాదాపు 80 శాతం 4-8 ఏళ్ల అనుభవం కలిగిన వారికి లభించినట్టు పేర్కొంది. ఆధునిక టెక్నాలజీల్లో నైపుణ్యాల కొరత దృష్ట్యా కంపెనీలు శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కన్నా నిర్దేశిత ప్రాజెక్టుల కోసం అనుభవం కలిగిన నిపుణులను నియమించుకుంటున్నాయి. దేశంలో విస్తరిస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వ్యవస్థ కూడా కాంట్రాక్టు నియామకాలకు దోహదపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి జీసీసీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వాటా దాదాపు 25 శాతం ఉండవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 19 , 2026 | 02:51 AM