Share News

బీమా ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:22 AM

బీమా రంగంలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా...

బీమా ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌

  • చర్చాపత్రం విడుదల చేసిన ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: బీమా రంగంలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా పాలసీల పంపిణీని మరింత పారదర్శకం చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వెబ్‌సైట్ల ద్వారా బీమా కంపెనీలు చేసే ఆన్‌లైన్‌ మోసాలకు (డార్క్‌ ప్యాటర్న్స్‌) చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం బుధవారం ఒక చర్చాపత్రం విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పాలసీల కొనుగోలుదారులు.. పాలసీ వివరాలు, ప్రీమియం వంటి విషయాలు ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు ముందుగానే ఆ వెబ్‌సైట్లకు వారి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన బెడద తప్పుతుంది. అంతేగాక పాలసీల పంపిణీ, ఖర్చులు, కమీషన్లు, మార్కెటింగ్‌ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది. బీమా పంపిణీని కూడా ఇన్సూరెన్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు (ఐడీఈ), ఇన్సూరెన్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పర్సన్స్‌ (ఐడీపీ), మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎంఐఐ) అని మూడు తరగతులుగా వర్గీకరిస్తారు.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:22 AM