ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌పై రెండు వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:47 AM
ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌పై భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) దృష్టి పెట్టింది. క్లెయిమ్‌ల ఆమోదం, తిరస్కరణకు...
ఐఆర్‌డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్
ముంబై: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌పై భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) దృష్టి పెట్టింది. క్లెయిమ్‌ల ఆమోదం, తిరస్కరణకు ప్రామాణిక కారణాలను ఖరారు చేసేందుకు పరిశ్రమ వర్గాలతో రెండు వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పది రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేస్తామని ఐఆర్‌డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ చెప్పారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ విధానం, తిరస్కరణలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ విధానాల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. దీంతో బీమా కంపెనీలు మరింత సమర్ధవంతంగా తమ ఆరోగ్య బీమా పాలసీలను మార్కెట్ చేయగలుగుతాయి. పాలసీల ఎంపికలో పాలసీదారులకూ ఈ విధానం మార్గదర్శిగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఆరోగ్య సేవలు అందించే హాస్పిటల్స్‌కి కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..