కోడింగ్ ఇక ప్రధానం కాదు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:18 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ వ్యాకరణాన్ని తిరగరాస్తోందని, టెక్ ఉద్యోగుల ప్రధాన విధి ఇకపై కోడ్ రాయడం కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని మంగళవారం...
టెక్ ఉద్యోగాలను పునర్‌నిర్వచించనున్న ఏఐ
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని
బెంగళూరు: కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ వ్యాకరణాన్ని తిరగరాస్తోందని, టెక్ ఉద్యోగుల ప్రధాన విధి ఇకపై కోడ్ రాయడం కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని మంగళవారం అన్నారు. కోడింగ్ శకం ముగిసి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నా రు. కొన్నేళ్ల క్రితం మనుగడలో లేని ఏఐ ఇంజనీర్లు, ఫార్వర్డ్ డెప్లాయ్‌మెంట్ ఇంజనీర్స్, ఫోరెన్సిక్ అనలిస్ట్ నిపుణుల అవసరం పెరగనుందన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్.. ఇలా గత సాంకేతిక పరివర్తనాలతో పోలిస్తే ఏఐని మరింత వేగంగా వినియోగించుకుంటున్నారని, ఇది వ్యాపారాల నిర్వహణను సమూలంగా మార్చనుందని ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్స్ డేలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ వంద కోట్ల మందికి అందుబాటులోకి వచ్చేందుకు 10 ఏళ్లు, స్మార్ట్‌ఫోన్లకు ఐదేళ్లు పట్టింది. ఏఐ వినియోగం మాత్రం తక్కువ సమయంలోనే విస్తృతమైందన్నారు.
ఏఐ ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ
ఇన్ఫోసిస్ ఏఐ ఫస్ట్ వేల్యూ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. 2030 నాటికి 30,000-40,000 కోట్ల డాలర్ల విలువైన ఏఐ సేవల అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటోంది. ఇన్ఫోసిస్ టోపాజ్ సూట్‌తో కూడిన ఈ ఫ్రేమ్‌వర్క్.. కంపెనీల వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఏఐ పరిష్కారాలు అందించనుంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం