Share News

ఇండస్‌ టవర్స్‌తో సిగ్నీ ఎనర్జీ జట్టు

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:03 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇండస్‌ టవర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో...

ఇండస్‌ టవర్స్‌తో సిగ్నీ ఎనర్జీ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇండస్‌ టవర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం అవసరమైన ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌ను సిగ్నీ అందించనుంది. అంతేకాకుండా టెలికాం ఇన్‌ఫ్రాలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా 1.5 గిగావాట్‌ అవర్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎ్‌స)ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా టెలికాం అప్లికేషన్స్‌కు సంబంధించి అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ టెక్నాలజీస్‌లో ఉన్న అవకాశాలను ఇరు సంస్థలు మదింపు చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 04:03 AM