ఇండక్షన్ కుక్‌వేర్‌కు ‘కస్టమ్స్’ రిలీఫ్!
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:58 AM
దేశంలో ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ఈ స్టవ్‌లు...
న్యూఢిల్లీ: దేశంలో ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ఈ స్టవ్‌లు, వంట పాత్రల తయారీలో ఉపయోగించే కీలక విడి భాగాల దిగుమతులపై విధించే దిగుమతి సుంకాల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం ఈ స్టవ్‌లు, వంట పాత్రలపై 18ు ఉన్న జీఎ్‌సటీనీ ఐదు శాతానికి కుదించాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన ఎల్‌పీజీ కొరత నుంచి బయట పడేందుకు చాలా కుటుంబాలు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్‌వేర్‌కు మారుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
యాపిల్ కొత్త సారథి జాన్ టర్నెస్
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,488 కోట్లు