ఇంద్రియా ‘రంగవల్లి’ జువెలరీ
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:05 AM
ఆదిత్య బిర్లా జువెలరీ విభాగం ఇంద్రియా.. బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద సస్టేనబుల్ జువెలరీ ‘రంగవల్లి’ని ఆవిష్కరించింది...
హైదరాబాద్: ఆదిత్య బిర్లా జువెలరీ విభాగం ఇంద్రియా.. బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద సస్టేనబుల్ జువెలరీ ‘రంగవల్లి’ని ఆవిష్కరించింది. దసరా పండగను పురస్కరించుకుని బెంగళూరులోని ఓరియన్ మాల్, శ్రీ సత్య గణపతి షిర్డీ సాయిబాబా దేవాలయంలో తన సరికొత్త పండగ కలెక్షన్ పద్మిక జువెలరీ డిజైన్‌ను పూర్తిగా ధాన్యపు ఉత్పత్తులతో 400 చదరపు అడుగుల్లో రంగవల్లి రూపంలో రూపొందించింది. ఇంద్రియా.. 22 క్యారట్ల బంగారంతో గులాబ్ మీనాకారి ఎనామిల్ క్రాఫ్ట్, తామరపువ్వుపై లక్ష్మీ దేవీ చిత్రంతో పాటు నకాషీ ఫ్లోరల్ డిజైన్‌తో పద్మిక ఆభరణాన్ని రూపొందించింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే ఈ ఆభరణాన్ని పూర్తిగా పర్యావరణహిత ఉత్పత్తులపైన వరి, మిల్లెట్స్, సీడ్స్‌ను ఉపయోగించి రంగవల్లి రూపంలో తీర్చిదిద్దింది. రంగోలీ చిత్రకారిణి శిఖా శర్మ.. ఈ పద్మిక జువెలరీ డిజైన్‌ను రంగవల్లి రూపంలో తీర్చిదిద్దినట్లు ఇంద్రి యా వెల్లడించింది. ఈ నెల 22 వరకు ఈ జువెలరీ రంగవల్లి సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే