ఇండిగో నష్టాలు రూ.2,537 కోట్లు
ABN , Publish Date - May 30 , 2026 | 02:37 AM
విమానయాన సంస్థ ఇండిగో.. మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చి త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రూపాయి పతనం, విదేశీ మారక ప్రభావం...
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో.. మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చి త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రూపాయి పతనం, విదేశీ మారక ప్రభావం, కార్యకలాపాల నిర్వహణలో సవాళ్లతో 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకంగా రూ.2,536.90 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,067. కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 23,097.05 కోట్ల నుంచి రూ.23,830.70 కోట్లకు పెరిగింది. కాగా 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,393.6 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు