టికెట్ రేటూ తక్కువే: ఇండిగో
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:46 AM
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘ఇండిగో లైట్’ పేరుతో సరికొత్త ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది....
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘ఇండిగో లైట్’ పేరుతో సరికొత్త ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎంట్రీ- లెవల్ ఫేర్ క్యాటగిరీలో క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే వారికి తక్కువ ధరలో టికెట్లను ఆఫర్ చేయనుంది. దీని కింద దేశీయ, అంతర్జాతీయ డైరెక్ట్ విమానాల్లో ప్రయాణించే ఎకానమీ క్లాస్ ప్రయాణికులు చెక్-ఇన్ లగేజీ లేకుండా 7 కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజీతో వెళ్లొచ్చు. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఆటో-అసైన్డ్ సీటు సదుపాయం ఉంటుంది. తక్కువ సామానుతో ప్రయాణించే వారు అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించే విధంగా ఈ టికెట్ ధరను రూపొందించినట్లు ఇండిగో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News