Share News

ఇండిగో సీఈఓ ఎల్బర్స్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:03 AM

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నానని, నోటీస్‌...

ఇండిగో సీఈఓ ఎల్బర్స్‌ రాజీనామా

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నానని, నోటీస్‌ గడువు నుంచి తనకు మినహాయింపు ఇచ్చి తక్షణం విధుల నుంచి విముక్తం చేయాలని ఆయ న యాజమాన్యాన్ని అభ్యర్థించారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఇండిగో యాజమాన్యం తక్షణం ఆయనకు విధుల నుంచి విముక్తి కల్పించింది. ఈ మేరకు యాజమాన్యం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇంతకాలంగా సేవలందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. నూతన సీఈఓను నియమించేంత వరకు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భాటియా తాత్కాలిక ప్రాతిపదికన ఇండిగో సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపింది. 2022 సెప్టెంబరు 6వ తేదీ నుంచి ఎల్బర్స్‌ ఇండిగో సారథిగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

Updated Date - Mar 11 , 2026 | 06:03 AM