ఇండిగో కొత్త సీఈఓ విలియం వాల్ష్
ABN , Publish Date - Apr 01 , 2026 | 02:27 AM
మార్కెట్ వాటాపరంగా దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. స్వతహాగా పైలట్ అయిన వాల్ష్ గతంలో...
ఆగస్టులో సారథ్య బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: మార్కెట్ వాటాపరంగా దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. స్వతహాగా పైలట్ అయిన వాల్ష్ గతంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఐఏజీ ( బ్రిటిష్ ఎయిర్‌వేస్ సహా పలు విమాన సంస్థల యాజమాన్య సంస్థ)కి సీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ సహా పలు అంతర్జాతీయ విమాన సంస్థలతో కూడిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ)కు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఏటీఏ చీఫ్‌గా విలియం పదవీకాలం ఈ జూలై 31తో ముగియనుంది. ఆగస్టు 3లోగా ఇండిగో పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన నియమాకానికి ఇండిగో యాజమాన్య సంస్థ ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి:
ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్
మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!