Share News

వస్తు సేవల ఎగుమతుల్లో రికార్డు

ABN , Publish Date - May 07 , 2026 | 06:19 AM

గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత వస్తు సేవల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 86,311 కోట్ల డాలర్లకు (సుమారు రూ.82 లక్షల కోట్లు) చేరుకున్నాయి...

వస్తు సేవల ఎగుమతుల్లో రికార్డు

గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 లక్షల కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత వస్తు సేవల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 86,311 కోట్ల డాలర్లకు (సుమారు రూ.82 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)లో 82,526 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ఎగుమతులు నమోదైనట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరించిన గణాంకాల ద్వారా వెల్లడైంది. వస్తువుల ఎగుమతులు 0.93 శాతం పెరిగి 43,770 కోట్ల డాలర్ల (2024-25) నుంచి 44,178 కోట్ల డాలర్లకు పెరిగాయి. సర్వీసుల ఎగుమతులు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో 42,132 కోట్ల డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సర ఎగుమతుల (38,755 కోట్ల డాలర్లు)కన్నా 8.71 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఐటీ, బిజినెస్‌ సొల్యూషన్లు, వృత్తిపరమైన నైపుణ్యం వంటి సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తోందని, సేవా రంగంలో భారత్‌ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

Updated Date - May 07 , 2026 | 06:19 AM