Share News

India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:38 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి ఎగబాకవచ్చని కేంద్రప్రభుత్వం అంచ నా వేసింది. వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదు కావచ్చన్న ఆర్‌బీఐ అంచనాల కంటే ఇది అధికం...

India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం

2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా

న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి ఎగబాకవచ్చని కేంద్రప్రభుత్వం అంచ నా వేసింది. వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదు కావచ్చన్న ఆర్‌బీఐ అంచనాల కంటే ఇది అధికం. తయారీ, సేవల రం గాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడవచ్చని కేంద్ర గణాంకాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రథమ ముం దస్తు అంచనాల్లో తెలిపింది. తద్వారా భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థల్లో తన అగ్రస్థానాన్ని కొనసాగించనుంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా నమోదైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం లో స్థూల విలువ జోడింపు (జీవీఏ) 7.3 శాతంగా నమోదు కావచ్చు. తయారీ, నిర్మాణ రంగాలు 7ు చొప్పున వృద్ధి చెందవచ్చని అంచనా. సేవల రంగం జీవీఏ 9.1ు వృద్ధి చెందవచ్చని మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. మనకు ప్రధాన పోటీ దేశమైన చైనా 2025లో 4.9ు, 2026లో 4.4ు వృద్ధిని నమోదు చేయవచ్చని ప్రపంచబ్యాంక్‌ ఈ మధ్యనే అంచనా వేసింది.

వ్యవసాయం డీలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, సంబంధిత రంగాల జీవీఏ 3.1 శాతానికి తగ్గనుందని.. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల రంగాల్లోనూ పరిమిత వృద్ధి నమోదు కావచ్చని కేంద్రం అభిప్రాయపడింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ లేదా నామినల్‌ జీడీపీ వృద్ధి రేటు 8ు ఉండవచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) బడ్జెట్‌ రూపకల్పనలో కేంద్రం ఈ గణాంకాలను ఉపయోగించుకోనుంది. వచ్చేనెల 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.


రూ.200 లక్షల కోట్లకు జీడీపీ

ఈ ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక జీడీపీ లేదా స్థిర ధరల ఆధారిత జీడీపీ రూ.201.90 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఆ శాఖ అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరపు ప్రాథమిక జీడీపీ అంచనా రూ.187.97 లక్షల కోట్లతో పో లిస్తే ఇది 7.4ు అధికం. కాగా, 2024-25లో రూ.330.68 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న జీడీపీ..2025-26లో 8ు వృద్ధి తో రూ.357.14 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం కేంద్రం నామినల్‌ జీడీపీ వృద్ధిని 10.1 శాతంగా అంచనా వేసిం ది. అమెరికా కరెన్సీలో ఈసారి మన జీడీపీ (డాలర్‌కు రూ.90 చొప్పున) 3.97 లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉంది.

2026-27లో 6.8% వృద్ధి: గోల్డ్‌మన్‌ శాక్స్‌

రాబోయే ఆర్థిక సంవత్సరం లో మాత్రం భారత జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతానికి పరిమితం కావచ్చని అంతర్జాతీ య బ్రోకరేజీ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. అలాగే, ఈ ఏడాదిలో ధరల సూచీలు మళ్లీ ఎగబాకవచ్చని, దాంతో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు అవకాశా లు సన్నగిల్లవచ్చని పేర్కొంది. ఈ ఏడాది లో ద్రవ్యోల్బణం సగటు 3.9 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది.

ఆర్థిక జోరు కొనసాగుతుంది..

ఈ ఏడాది కూడా ఆర్థిక వృద్ధి జోరు కొనసాగనుంది. భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం గతంలో అంచనా వేసిన దానికంటే కూడా తక్కు వే. దేశీయంగా అధిక వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం వంటి సానుకూల అంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ వృద్ధి రేటు 6.5-7ు శ్రేణిలో నమోదు కావచ్చు. ఈ ఏడాది దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎ్‌ఫడీఐ), విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) పెరిగి రూపాయి బలోపేతానికి దోహదపడనున్నాయి. ప్రస్తుతం భారత్‌ గోల్డిలాక్స్‌ (అధిక వృద్ధి, కనిష్ఠ ద్రవ్యోల్బణ స్థితి) దశలో ఉంది. వచ్చే రెండేళ్లపాటు ఇది కొనసాగనుంది.

- ఎస్‌ మహేంద్ర దేవ్‌, పీఎంఈఏసీ చైర్మన్‌


దిగుమతులు తగ్గి..

ఎగుమతులు పెరగాలి

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే భారత్‌ దిగుమతులను తగ్గించుకోవడంతోపాటు ఎగుమతులను మరింతగా పెంచుకోవాల్సి ఉంటుంది. పంట వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా కాలుష్యంతోపాటు ముడిచమురు దిగుమతులను భారీగా తగ్గించుకోవచ్చు.

- నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి..

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 08 , 2026 | 06:38 AM