India Electronics Export: ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:48 AM
భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు, పరికరాలు ఎగుమతవుతున్నాయి. గత ఏడాది ఈ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు మించిపోయినట్టు కేంద్ర ఐటీ...
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూడిల్లీ: భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు, పరికరాలు ఎగుమతవుతున్నాయి. గత ఏడాది ఈ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు మించిపోయినట్టు కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో ఐఫోన్ల ఎగుమతుల విలువే రూ.2.03 లక్షల కోట్ల వరకు ఉందన్నారు. 2024తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. 2024లో మన దేశంలో రూ.11.3 లక్షల కోట్ల విలువైన ఎలకా్ట్రనిక్ వస్తువులు ఉత్పత్తి అయితే అందులో రూ.3.3 లక్షల కోట్ల విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి. ప్రస్తుతం ఈ రంగంలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 25 లక్షలు మించిపోయింది.
రూ.6.76 లక్షల కోట్లకు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశం లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి విలువ ఎంత లేదన్నా 7,500 కోట్ల డాలర్లకు (రూ.6.76 లక్షల కోట్లు), ఎగుమతులు 3,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.7 లక్షల కోట్లు) చేరుతాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా. ఈ సంవత్సరం మన దేశంలో నాలుగు సెమీకండక్టర్ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.దీంతో మన దేశం నుంచి ఎలకా్ట్రనిక్స్, మొబైల్ ఫోన్ల ఎగుమతులు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!