ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:42 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14.64 శాతం పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14.64 శాతం పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం వృద్ధితో 2.08 లక్షల కోట్లు, నికర కార్పొరేటేతర పన్ను వసూళ్లు 8 శాతం వృద్ధితో దాదాపు రూ.2.94 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కార్పొరేటేతర పన్నులో వ్యక్తు లు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు చెల్లించిన పన్నులు ఉంటాయి. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను నుంచి వసూళ్లు 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరుకున్నాయి. అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 15.30 శాతం వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..