ఆటుపోట్లలోనే..!
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:49 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లలో సాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు జియో పొలిటికల్ పరిణామాలే ఇందుకు ప్రధాన కారణంగా...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లలో సాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు జియో పొలిటికల్ పరిణామాలే ఇందుకు ప్రధాన కారణంగా ఉండనున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లు పూర్తిగా బేర్ పట్టులో కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లలో కచ్చితమైన స్టాప్‌లా్‌సతో పెట్టుబడులు పెట్టడం మంచిది. నెగటివ్ సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే నిఫ్టీ మరింత పతనం కావచ్చు. ప్రస్తుతం మెటల్స్, కమోడిటీస్ రంగ షేర్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి.
స్టాక్ రికమండేషన్స్
టెక్ మహీంద్రా: స్వల్ప పుల్‌బ్యాక్ తర్వాత ఈ కౌంటర్ మంచి మూమెంటమ్‌ను కనబరుస్తోంది. సమీప నిరోధాన్ని అధిగమించేందుకు సిద్ధమైంది. పైగా నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. మూడు నెలల్లోనే 25 శాతం లాభాన్ని అందించింది. గత శుక్రవారం రూ.1,701 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,680 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,840 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,650.
ఓఎన్‌జీసీ: జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 45 శాతం మేర పతనమైన ఈ కౌంటర్ ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.230 పై స్థాయిలో కదలాడుతోంది. పది రోజులుగా మంచి వాల్యూమ్‌తో మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడ్డాయి. గత శుక్రవారం రూ.245 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.240 శ్రేణిలో ఎంటరై రూ.290 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.225.
హిందాల్కో: గత ఏడాది మే నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. దాదాపుగా 65 శాతం మేర లాభాన్ని అందించింది. నిఫ్టీతో పోలిస్తే జోరు ప్రదర్శిస్తోంది. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో తక్కువ వాల్యూమ్ నమోదవడాన్ని బట్టి చూస్తే ఇన్వెస్టర్లు ఈ షేరును వదులుకోవటానికి ఇష్టపడటం లేదని అర్ధమవుతోంది. గత శుక్రవారం రూ.950 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.930 శ్రేణిలో ప్రవేశించి రూ.990 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.910.
వేదాంతలిమిటెడ్: గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. చిన్నచిన్న పుల్‌బ్యాక్స్ తప్ప బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. నిఫ్టీతో పోలిస్తే రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.684 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.680 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.760 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.660 వద్ద స్టాప్‌లాస్ తప్పనిసరి.
డాక్టర్ రెడ్డీస్: కొన్ని నెలలుగా స్తబ్దుగా, డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు కీలకమైన మద్దతు స్థాయి వద్ద కదలాడుతోంది. చివరి రెండు సెషన్లలో ఈ షేరు భారీ వాల్యూమ్‌తో గణనీయంగా పెరిగింది. ట్రెండ్ రివర్సల్‌కు అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,235 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,200 స్థాయి లో ప్రవేశించి రూ.1,320 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,170.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు