మూడో రోజూ లాభాల్లోనే
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:50 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్ లో 82,325- 81,576 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్ చివరికి...
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్ లో 82,325- 81,576 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్ చివరికి 31.61 పాయింట్ల స్వల్ప లాభంతో 81,911.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.30 పాయింట్ల పెరుగుదలతో 25,299.35 వద్ద స్థిరపడింది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, చమురు ధరల తగ్గుముఖం ఇందుకు తోడ్పడ్డాయి. బీఎస్ఈలోని స్మాల్‌క్యాప్ సెలెక్ట్, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీలు మాత్రం ఒక శాతానికి పైగా ఎగబాకాయి. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.55 లక్షల కోట్లు పెరిగి రూ.512.27 లక్షల కోట్లకు చేరింది.
‘జీ’ రూ.600 కోట్ల బైబ్యాక్: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ రూ.600 కోట్ల విలువైన 6.5 కోట్లకు పైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేరుకు రూ.91 చొప్పున చెల్లించనుంది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు ముగింపు ధర రూ.73.50తో పోలిస్తే 23.8ు అధికమిది.
అత్యంత విలువైన మార్కెట్లలో మళ్లీ ఐదో స్థానానికి భారత్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరం గా, ప్రపంచంలోని అత్యంత విలువైన మార్కెట్లలో తైవాన్‌ను వెనక్కి నెట్టి భారత్ మళ్లీ 5వ స్థానానికి ఎగబాకింది. గత కొన్ని రోజుల్లో భారత మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకోవడం ఇందుకు దోహదపడింది. దాంతో భారత స్టాక్ మార్కెట్ సంపద 5.46 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. కాగా, అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ వరుసగా మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ